Tomato Price: సామాన్యులు టమాటా రేటు పెరగడంతో ఏం తినేట్టు లేదు.. ఏం కొనేట్టులేదు అన్నట్లుగా పాటలు పాడుకుంటున్నారు. వారం వారం కేజీ లేదా రెండు కేజీలు కొనుగోలు చేసే వారు కాస్త ఇప్పుడు పావు కేజీ లేదా అర కేజీ కొనుగోలు చేస్తూ ఉన్నారు. కొంత మంది బాబోయ్ మేము టమాటాలు తినేంత ధనవంతులం కాదు అన్నట్లుగా వాటిని మానేశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మొత్తానికి టమాట ప్రస్తుతం దేశంలో అత్యంత హాట్ టాపిక్ అయింది అనడంలో సందేహం లేదు. టమాటాలు ఒకప్పుడు రోడ్డు మీద ఊరికే ఉన్నా కూడా తీసుకుని వెళ్లేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. టమాటా లోడ్ ను లూటీ చేయడం మొదలుకుని టమాటా రైతులను హత్య చేసే వరకు పరిస్థితి వెళ్లింది. తాజాగా ఒక పచ్చని కాపురంలో టమాటా రేటు చిచ్చు పెట్టింది. 


వివరాల్లోకి వెళ్తే... మధ్య ప్రదేశ్‌ షాదోల్‌ జిల్లా బెమ్‌ హోరి గ్రామానికి చెందిన సందీప్ బర్మన్‌ దాబాను నడుపుతూ ఉంటాడు. ఆయన తన రోజు వారి వంటల కోసం గతంలో పెద్ద ఎత్తున టమాటాలు వినియోగించేవాడు. కానీ రేట్లు పెరిగిన నేపథ్యంలో సందీప్ భార్య టమాటాలు వినియోగించవద్దంటూ కండీషన్ పెట్టింది. ఇంట్లో అవసరాల నిమిత్తం కొద్ది మొత్తంలో టమాటాలు తెచ్చి సందీప్‌ భార్య ఇంట్లో పెట్టింది. 


అయితే వాటిల్లో రెండు టమాటాలను సందీప్ భార్య కు తెలియకుండా వినియోగించాడట. దాంతో ఇంట్లో అవసరాల కోసం అంత ఖర్చు పెట్టి తీసుకు వచ్చిన టమాటాలను అలా ఎలా దాబాలో వినియోగిస్తావు అంటూ సందీప్ పై గొడవ పడిందట. ఇద్దరి మధ్య మాటా మాట పెరిగి చిన్న కూతురు ను తీసుకుని తన పుట్టింటికి వెళ్తున్నట్లుగా చెప్పి వెళ్లి పోయిందట. 


Also Read: Kia Motors: కియా మోటార్స్ అరుదైన ఘనత, ఏపీ ప్లాంట్ నుంచి 10 లక్షల కార్లు


రోజులు గడుస్తున్నా కూడా భార్య రాకపోవడంతో సందీప్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు ఆమె పుట్టింట్లో ఎంక్వౌరీ చేయగా అక్కడికి వెళ్లలేదని తేలింది. దాంతో ఆమె ఫోన్ నెంబర్ ను ట్రేస్ చేయగా ఆమె తన సోదరి వద్ద ఉంటున్నట్లుగా తెలిసింది. దాంతో పోలీసులు ఆమె వద్దకు వెళ్లి స్టేషన్ కు తీసుకు వచ్చి భర్త సందీప్ ను కూడా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారట. 


మొత్తానికి టమాటా రేటు కారణంగానే ఈ పచ్చని కాపురంలో నిప్పులు అంటూ స్థానికంగా ఉన్న వారు మాట్లాడుకుంటున్నారు. టమాటా రేటు ప్రస్తుతం కొన్ని ఏరియాల్లో రెండు వందల రూపాయలకు మించి ఉన్నాయి. అంతే కాకుండా కొన్ని ఏరియాల్లో అసలు టమాటా లభించడం లేదు. రెండు నుండి మూడు వారాల వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల వారు అంటున్నారు. టమాటా పండించిన వారి పంట పండింది.


Also Read: Flipkart Offers On Mobiles 2023: ఫ్లిప్‌కార్టులో ఆఫర్ల జాతర..ఒప్పో Reno 10, 10 Pro 5G స్మార్ట్‌ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook